ఈనెలలో టాలీవుడ్‌లో పెళ్లిబాజాలు మోగుతున్నాయి. ఇటీవల మంచు మనోజ్ వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇక 28న తాగుబోతు రమేష్ వివాహం, 29న అల్లరినరేష్‌ల పెళ్లిళ్లు జరిగాయి. కాగా త్వరలో మరో హీరో సోదరి వివాహం జరుగనుందని సమాచారం. యువ హీరో వరుణ్‌సందేశ్ సోదరి వీణ సాహితి వివాహం కూడా త్వరలో జరుగనుంది. మొత్తానికి మన బ్యాచ్‌లర్స్ అయిన హీరోలందరూ ఓ ఇంటి వాళ్లు అవుతుండటం సంతోషించదగ్గ విషయం.