Advertisementt

ఆ చిత్రాన్ని తమిళంలో డబ్‌ చేయనున్నారు...!

Fri 29th May 2015 11:37 AM
malli malli idi rani roju,kranthi madhav,vallabha,nithya menon  ఆ చిత్రాన్ని తమిళంలో డబ్‌ చేయనున్నారు...!
ఆ చిత్రాన్ని తమిళంలో డబ్‌ చేయనున్నారు...!
Advertisement
Ads by CJ

సీనియర్‌ నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో సి.సి.మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లిమిటెడ్‌ పతాకంపై రూపొంది విజయవంతమైన చిత్రం ‘మళ్లీమళ్లీ ఇది రాని రోజు’. క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.ఎ. వల్లభ నిర్మించాడు. తెలుగులో మంచి చిత్రంగా విజయవంతమైన ఈ చిత్రాన్ని తమిళంలో ‘నీ నాన్‌ నామ్‌’ (నువ్వు, నేను, మనం) అన్న పేరుతో విడుదల చేయనున్నారు. ఇప్పటికే తమిళంలో రెండు స్ట్రెయిట్‌ చిత్రాల్లో నటించిన హీరో శర్వానంద్‌కు అక్కడ మంచి గుర్తింపు ఉంది. అలాగే హీరోయిన్‌ నిత్యామీనన్‌కు కూడా అక్కడ మంచి మార్కెట్‌ ఉండటంతో ప్లస్‌ అవుతుందని భావిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘ఓకే కన్మణి’ సక్సెస్‌ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో అక్కడ మంచి బిజినెస్‌ జరుగుతుందని భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ