Advertisementt

విజయవాడను కొత్తకోణంలో చూపిస్తారట....!

Fri 29th May 2015 11:05 AM
srikanth addala,vijayawada,brahmothsawam,maheshbabu  విజయవాడను కొత్తకోణంలో చూపిస్తారట....!
విజయవాడను కొత్తకోణంలో చూపిస్తారట....!
Advertisement
Ads by CJ

త్వరలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా పివిపి సంస్థ ‘బ్రహొత్సవం’ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. విజయవాడ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ నెలాఖరున సినిమా ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ప్రీపొడక్షన్‌పనులు వేగం చేశాడు. ఇందులో భాగంగా ఆయన కెమెరామెన్‌ రత్నవేలు, ఆర్ట్‌డైరెక్టర్‌ తోట తరణిలతో కలిసి విజయవాడలో లొకేషన్లను పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్‌, కనకదుర్గ టెంపుల్‌లతో పాటు సిటీలోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గతంలో ఏ సినిమాలోనూ లేని విధంగా శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రంలో విజయవాడను అద్భుతంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా స్టోరీకి విజయవాడకు అటాచ్‌మెంట్‌ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ