Advertisementt

ఇంతకి 'కిక్‌-2' విడుదల ఎప్పుడు..??

Fri 29th May 2015 08:05 AM
kick2,release date,jyothi laxmi,june 12  ఇంతకి 'కిక్‌-2' విడుదల ఎప్పుడు..??
ఇంతకి 'కిక్‌-2' విడుదల ఎప్పుడు..??
Advertisement
Ads by CJ

తెలుగు ప్రేక్షకులకు సరికొత్త పంథాలో వినోదం పంచిన 'కిక్‌' సినిమా రవితేజ కెరియర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక దీనికి కొనసాగింపుగా వస్తున్న 'కిక్‌-2' గురించి యావత్‌ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 9న ఆడియో రిలీజ్‌ కావడంతో ఇదే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ ఊహించారు. కాని ఆడియో విడుదలై మూడు వారాలవుతున్నా.. సినిమా రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇవ్వలేకపోతోంది 'కిక్‌-2' యూనిట్‌.

వేసవిలో ముఖ్యంగా మే నెలలో పెద్ద సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఓవైపు వేసవి సెలవులు.. మరోవైపు పెద్ద సినిమాలు కూడా లేకపోవడంతో ప్రేక్షకులు బోరింగ్‌గా ఫీలయ్యారు. ఇక మే చివరి వారంలో కిక్‌-2 వచ్చి హాలిడేస్‌ను సొమ్ము చేసుకుంటుందని అందరూ భావించారు. కాని వారాలకు వారాల తరబడి సినిమా విడుదలను వాయిదా వేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. అంతర్గత సమాచారం ప్రకారం.. జూన్‌12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని యూనిట్‌ ప్రచారం చేస్తోంది. అదే రోజు 'జ్యోతిలక్ష్మి'ని విడుదల చేస్తున్నట్లు పూరిజగన్నాథ్‌ ప్రకటించాడు. అయితే జూన్‌12న కచ్చితంగా 'కిక్‌-2' వచ్చే అవకాశాలుంటే పూరి ఓ వారం వెనక్కితగ్గేవాడు. ఇక ఆయన జూన్‌12కు ఫిక్స్‌ అయ్యాడంటే ఆ రోజు 'కిక్‌-2' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ