నాగార్జున, అనుష్కల జోడీ ‘సూపర్’. కాగా వీరిద్దరికీ మంచి ఫ్రెండ్‌షిప్ కూడా ఉంది. కాగా ప్రస్తుతం అనుష్క ప్రధానపాత్రలో నటిస్తోన్న ‘సైజ్‌జీరో’ చిత్రంలో నాగార్జున తళుక్కుమని మెరవనున్నాడు. ఈ చిత్రాన్ని పివిపి సంస్థ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరో గుడ్‌న్యూస్ ఏమిటంటే.... పివిపి సంస్థ నాగార్జున, కార్తి హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఓ కీలకమైన అతిథి పాత్ర ఉందిట. ఈ పాత్రను అనుష్క చేయనుందని సమాచారం. ఈ పాత్రను పోషించమని స్వయంగా నాగార్జున అనుష్కకు ఫోన్ చేసి మరీ ఒప్పించాడని సమాచారం. ఈ రెండు చిత్రాలను ఒకే సంస్థ నిర్మిస్తుండటం కూడా దీనికి కలిసొచ్చింది. కాగా తమన్నా మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో అనుష్క పాత్ర పోలీస్ పాత్ర అని సమాచారం.