టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దికాలంలోనే కమెడియన్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న తాగుబోతు రమేష్ ఓ ఇంటివాడయ్యాడు. తన సొంత గ్రామం నిజామాబాద్‌లో ఈరోజు ఉదయం 8.22 గంటలకు తాగుబోతు రమేష్ వివాహం జరిగింది. అత్యంత సన్నిహితులు, బంధువులు మధ్య స్వాతి మెడలో రమేష్ తాళిబొట్టు కట్టాడు. కమెడియన్లు ధన్‌రాజు, వేణు తదితరులు వివాహ మహోత్సవానికి హాజరయ్యారు.
వివాహాన్ని సింపుల్‌గా చేసుకున్న రమేష్ రిసెప్షన్‌ను మాత్రం గ్రాండ్‌గా చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని దాస్‌పల్లి హోటల్‌ను బుక్ చేశాడు. మే 30 సాయంత్రం 7.30 గంటలకు జరిగే ఈ రిసెప్షన్‌కు ఇండస్ట్రీలోని నటీనటులందర్నీ రమేష్ ఆహ్వానించినట్లు సమాచారం. ఈమధ్య కాలంలో కమెడీయన్‌గా అత్యంత ఆదరణ పొందుతున్న రమేష్ వివాహానికి ఇండస్ట్రీ పెద్దలందరూ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.