తెలుగులో అశోక్, జై చిరంజీవ చిత్రాల్లో మెరిసిన సమీరారెడ్డి మీకు గుర్తే ఉండి ఉంటుంది. తెలుగు తెరపై ఆమె కనబడక చాన్నళ్లే అయ్యింది. అయితే గతేడాది వరకు కూడా ఆమె బాలీవుడ్‌లో నటిస్తునే ఉంది. 2014 జనవరిలో సమీరారెడ్డి వ్యాపారవేత్త అక్షయ్ వర్ధేను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇక ఈ సోమవారం ముంబైలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది సమీరారెడ్డి. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆమె సోదరి సుష్మారెడ్డి తెలిపారు.
పెళ్లి జరిగిన అనంతరం ఆమె సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇక ఇప్పుడు ఆమెకు ఓ బిడ్డ కూడా ఉన్నాడు కాబట్టి సమీరారెడ్డి ఇకపై సినిమాల్లో కనిపించే అవకాశాలు లేవనే చెప్పాలి. ఈ వార్త ఈ ముద్దుగుమ్మ అభిమానులకు కాస్త నిరాశ కలిగించేదే.