Advertisementt

షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్‌..??

Wed 27th May 2015 07:32 AM
adah sharma,accident,gharam,aadi  షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్‌..??
షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్‌..??
Advertisement
Ads by CJ

హీరోయిన్‌ అదాశర్మ సినిమా షూటింగ్‌లో గాయపడినట్లు సమాచారం. బైక్‌పైనుంచి పడిన ఆమెకు తీవ్రగాయాలు కావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె హీరో ఆదితో కలిసి 'గరమ్‌' షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. అయితే సినిమా షూటింగ్‌లో భాగంగా ఆమె బైక్‌పై వెళ్తుండగా కిందపడి గాయపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వెంటనే సినిమా యూనిట్‌ ఆమెను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించింది.

అయితే షూటింగ్‌లో గాయపడినట్లు వెలువడుతున్న వార్తల్లో నిజం లేదని అదాశర్మ పేర్కొంది. తాను తీవ్ర జ్వరంతో బాధపడుతున్నందునే ఆస్పత్రిలో చేరినట్లు చెప్పింది. ఇక యాక్సిడెంట్‌ విషయమై సినిమా యూనిట్‌ కూడా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. హార్ట్‌ఎటాక్‌, సన్నాఫ్‌ సత్యమూర్తి, రాణా విక్రమ్‌ తదితర చిత్రాల్లో అదాశర్మ హీరోయిన్‌గా నటించింది.