Advertisementt

మణిరత్నం ని ఫాలో అవుతున్న శంకర్‌.!

Wed 27th May 2015 04:53 AM
rajnikanth,shahrukh khan,director shankar,robo movie,robo2   మణిరత్నం ని ఫాలో అవుతున్న శంకర్‌.!
మణిరత్నం ని ఫాలో అవుతున్న శంకర్‌.!
Advertisement
Ads by CJ

ఆమధ్య విక్రమ్‌, పృథ్విరాజ్‌, ఐశ్వర్యారాయ్‌ ప్రధాన పాత్రల్లో మణిరత్నం రూపొందించిన ‘రావణ్‌’(తెలుగులో ‘విలన్‌’) కమర్షియల్‌గా సక్సెస్‌ కాకపోయినా సినిమాపరంగా బాగుందనే టాక్‌ వచ్చింది. ఈ చిత్రం తమిళ్‌ వెర్షన్‌లో పృథ్విరాజ్‌ హీరో, విక్రమ్‌ విలన్‌. హిందీ వెర్షన్‌లో విక్రమ్‌ హీరో, అభిషేక్‌ బచ్చన్‌ విలన్‌. ఇలా డిఫరెంట్‌గా మణిరత్నం చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు శంకర్‌ రిపీట్‌ చెయ్యబోతున్నట్టు తెలుస్తోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో చేసిన ‘రోబో’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘రోబో2’ని ప్లాన్‌ చేస్తున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారని చాలా మంది పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా ఈ చిత్రంలో షారూఖ్‌ఖాన్‌ నటించే అవకాశం వుందని తెలుస్తోంది. రావణ్‌కి మణిరత్నం వెళ్ళిన స్కీమ్‌లోనే శంకర్‌ కూడా వెళ్తున్నాడట. తమిళ్‌లో రజనీకాంత్‌ హీరో అయితే, షారూఖ్‌ ఖాన్‌ విలన్‌గా నటిస్తాడట. అలాగే హిందీలో షారూఖ్‌ ఖాన్‌ హీరో అయితే, రజనీకాంత్‌ విలన్‌గా నటిస్తాడట. ఇదంతా చెప్పడానికి, వినడానికి బాగానే వుంది గానీ ఈ స్కీమ్‌ సెట్స్‌ వరకు వెళ్తుందా, వెళ్ళినా ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందనేది డౌటే. అయితే దీని మీద శంకర్‌ సీరియస్‌గా వర్క్‌ చేస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌గా ఎనౌన్స్‌మెంట్‌ వుంటుందని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ