రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొంందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి.. ది బిగినింగ్’ (పార్ట్ 1) ఆడియో వేడుకను మే 31న జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆడియో వేడుకకు హైదరాబాద్ హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్ వేదిక కానుంది. కాగా ఈ వేడుకకు ‘ఈగ’ హీరో నాని యాంకరింగ్ చేయనున్నాడు. మరి లేడీ యాంకర్‌గా ఎవరు ఉంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ‘బాహుబలి’ని చైనీస్ భాషలో కూడా విడుదలచేయాలని ఆలోచిస్తున్న ‘బాహుబలి’ యూనిట్‌కు తాజాగా జరిగిన ఓ సంఘటన మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.
బాలీవుడ్‌లో అమీర్‌ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాని దర్శకత్వంలో రూపొందిన ‘పీకే’ చిత్రం చైనీస్ భాషలోకి అనువాదమైంది. గత శుక్రవారం చైనాలో మొత్తం 4,600 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మన కరెన్సీ లెక్కల ప్రకారం 178.34కోట్లను వసూలు చేసింది. ఒక భారతీయ చిత్రం చైనాలో ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించడం ఇదే ప్రధమం. గతంలో అమీర్‌ఖాన్ ‘3ఇడియట్స్’ కూడా చైనాలో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యాన్ని గమనించిన ‘బాహుబలి’ చిత్ర యూనిట్ చైనాలో కూడా విడుదల చేస్తుండటంతో ‘పీకే’ సాధించిన వసూళ్లను చూసి తమ చిత్రం కూడా అక్కడ అదే స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతుందనే ఆశాభావంతో ఉన్నారు.