రకుల్‌ప్రీత్‌సింగ్.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎవరి నోట విన్నా ఆమె నామస్మరణే. నెంబర్‌వన్ స్థానానికి ఒక్క అడుగు దూరంలో ఉన్న రకుల్‌ప్రీత్‌సింగ్ హవా ఈ నెల 29న మొదలై వచ్చే ఏడాది సంక్రాంతి వరకు సాగనుంది. ఈనెల 29న రామ్ సరసన ఆమె నటిస్తోన్న ‘పండగచేస్కో’ చిత్రం విడుదలవుతుంది. ఆ వెంటనే జూన్ రెండోవారంలో రవితేజ హీరోగా ఆమె నటించిన ‘కిక్2’ విడుదలకు రెడీ అవుతోంది. ఇక వచ్చే షెడ్యూల్ నుండి రకుల్ రామ్‌చరణ్-శ్రీనువైట్ల చిత్రంలో జాయిన్ కానుంది. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆమె నటిస్తోన్న ఎన్టీఆర్-సుకుమార్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతిలో విడుదలకు నిర్ణయించారు. ఇక డేట్స్ అడ్జెస్ట్ కానప్పటికీ ఏదో ఒకలా అడ్జెస్ట్ చేసుకొని మహేష్‌బాబు ‘బ్రహోత్సవం’కు కూడా ఓకే చెప్పాలని ఆమె భావిస్తోందిట. అదే జరిగితే ‘బ్రహోత్సవం’ కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే విడుదల అవుతుంది. మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్‌లో రకుల్ ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది.