Advertisementt

ప్రభాస్ అంచనాలు తగ్గిస్తున్నాడా..!

Wed 27th May 2015 12:35 AM
bahubali,prabhas,rajamouli,student no 1,jr ntr,shivudu  ప్రభాస్ అంచనాలు తగ్గిస్తున్నాడా..!
ప్రభాస్ అంచనాలు తగ్గిస్తున్నాడా..!
Advertisement
Ads by CJ

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆకాశమే హద్దుగా.. అంతులేని అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రంపై వున్న అంచనాలను తగ్గించడానికి ప్రభాస్, రాజమౌళి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇందులోనే భాగంగా సినిమాలో హీరో, హీరోయిన్ పోస్టర్‌తో పాటు ఇతర ఆర్టిస్టుల స్టిల్స్‌ను కూడా విడుదల చేసి ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత వుందని రాజమౌళి చెప్పకనే చెప్పాడు. 

ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌లో ప్రభాస్ తనకు ‘బాహుబలి’ ఇంటర్వెల్ బ్యాంగ్ కంటే  ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెం.1’లో వుండే ఇంటర్వెల్ బ్యాంగ్ నచ్చిందని చెప్పారు. దీంతో అక్కడనున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక  ఓ మతలబు వుందట. చిత్రంపై వున్న అంచనాలను బ్యాలెన్స్ చేయడానికే ప్రభాస్ కూడా సినిమా గురించి అలా చెప్పాడని అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. అనుష్క, తమన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రానా కీలక పాత్రలో నటిస్తున్నారు . చారిత్రక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ బాహుబలిగా, శివుడిగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. వెయ్యేళ్ల క్రితం జరిగిన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అధికారం కోసం కొన్ని తరాల పాటు సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ  సినిమా ఆసక్తికరంగా సాగుతుందని చిత్ర వర్గాలు వెల్లడించాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ