Advertisementt

లండన్‌లో మకాం వేసిన మెగాస్టార్‌.!

Tue 26th May 2015 10:26 AM
chiru 150th movie,puri jagannath,chiru 150th movie in october  లండన్‌లో మకాం వేసిన మెగాస్టార్‌.!
లండన్‌లో మకాం వేసిన మెగాస్టార్‌.!
Advertisement
Ads by CJ

దాదాపు 8 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి ఓ సినిమా చెయ్యబోతున్న విషయం తెలిసిందే. చిరంజీవి 150వ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్‌ చెయ్యబోతున్నారన్న విషయంలో మీడియాలో వచ్చిన రకరకాల ఊహాగానాల తర్వాత పూరి జగన్నాథ్‌కి ఆ అవకాశం దక్కింది. ఎప్పటి నుంచో చిరుతో సినిమా చెయ్యాలన్న పూరి చిరుకానుక ఈ చిత్రంతో తీరబోతున్నందుకు అతను చాలా హ్యాపీగా వున్నాడు. చిరంజీవి 150వ సినిమాని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్న పూరి స్క్రిప్ట్‌ విషయంలో చాలా కేర్‌ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం బ్యాంకాక్‌లో డైలాగ్‌ వెర్షన్‌ చెక్కుతున్నాడు పూరి. 

 

ఇదిలా వుంటే 8 సంవత్సరాల గ్యాప్‌ తీసుకొని రాజకీయాల్లో బిజీ అయిపోయిన చిరంజీవి తన ఫిట్‌నెస్‌ విషయంలో అశ్రద్ధ చేశాడు. ఇప్పుడు 150వ సినిమా ఓకే అయిన తర్వాత తన ఫిజిక్‌ విషయంలో కేర్‌ తీసుకుంటున్నాడు. అందుకే గత కొన్ని రోజులుగా లండన్‌లో మకాం వేశాడు చిరు. తన లుక్‌ మార్చుకోవడానికి అక్కడ కసరత్తులు చేస్తున్నాడు. 150వ సినిమా చెయ్యడానికి ఎంతో ఉత్సాహంగా వున్న చిరు అంతే ఉత్సాహంతో తన మేకోవర్‌ని కూడా చేస్తున్నాడు. అంటే తొందరలోనే ఒక కొత్త లుక్‌తో మెగాస్టార్‌ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడన్నమాట. డైలాగ్‌ వెర్షన్‌ పూర్తి చేసుకొని ఇండియా వచ్చిన తర్వాత జూన్‌లో చిరు సరసన నటించే హీరోయిన్‌ని సెలెక్ట్‌ చేస్తారట. జూలైలో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆగస్ట్‌ 22 మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజున ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ