Advertisementt

అక్టోబర్‌లో పవర్‌స్టార్‌, దాసరి చిత్రం?

Tue 26th May 2015 10:22 AM
pawan kalyan,dasari narayana rao,pawan dasari combo movie in october  అక్టోబర్‌లో పవర్‌స్టార్‌, దాసరి చిత్రం?
అక్టోబర్‌లో పవర్‌స్టార్‌, దాసరి చిత్రం?
Advertisement
Ads by CJ

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోందని ఆమధ్య వార్తలు వచ్చాయి. ఎవరూ ఊహించని కాంబినేషన్‌లో సినిమా అనేసరికి అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. అది జరిగే ప్రాజెక్ట్‌ కాదని కొట్టి పారేశారు. అయితే అదే ఇప్పుడు నిజం కాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్ళనుందని సమాచారం. 

దాసరి నారాయణరావు నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రానికి మూడు కథలు రెడీ చేశాడట. ఆ మూడిరటిలో ఏ కథతో సినిమా చెయ్యాలనే ఫైనల్‌ డెసిషన్‌ కళ్యాణే తీసుకోవాల్సి వుంది. పవన్‌కళ్యాణ్‌, దాసరి కాంబినేషన్‌లో సినిమా వుందనే మాట వాస్తవమేనని తెలుస్తున్నప్పటికీ ఆ చిత్రానికి ఎవరు డైరెక్టర్‌ అనే విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఒక కొత్త డైరెక్టర్‌ని ఈ సినిమా ద్వారా పరిచయం చెయ్యాలని దాసరి ఆలోచిస్తున్నారు. అయితే పవన్‌కళ్యాణ్‌లాంటి హీరోని డైరెక్ట్‌ చెయ్యడం అంటే ప్రస్తుతం కొత్త డైరెక్టర్‌ వల్ల అవుతుందా అనే సందేహం కూడా వారికి వుంది. పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఈ చిత్రాన్ని ‘గోపాల గోపాల’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన కిషోర్‌కుమార్‌ పార్థసాని చేతుల్లో పెట్టాలని ఆలోచిస్తున్నాడట. ఎందుకంటే ‘గోపాల గోపాల’ టైమ్‌లోనే కిశోర్‌తో సినిమా చేస్తానని ప్రామిస్‌ చేసిన పవన్‌ మంచి సబ్జెక్ట్‌ వుంటే చెప్పమని అడిగాడు. ఎలాగూ ఈ సినిమాకి ఒక మంచి డైరెక్టర్‌ కావాలి. అదేదో కిశోర్‌తోనే చేయిస్తే బాగుంటుందని పవన్‌కళ్యాణ్‌ సజెస్ట్‌ చేశాడట. 

అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే ఈ చిత్రం ‘గబ్బర్‌సింగ్‌2’ తర్వాత స్టార్ట్‌ అయ్యే అవకాశం వుంది. మే 29న ‘గబ్బర్‌సింగ్‌2’ షూటింగ్‌ పూనేలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సో, పవన్‌, దాసరి కాంబినేషన్‌లో ఒక కొత్త తరహా సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ