ఇరువురు భామల మధ్య నలిగిపోతే.. దాన్ని నారి నారి నడుమ మురారి అంటారు. అదే ఇద్దరు స్టార్ హీరోల మధ్య నలిగిపోయే డైరెక్టర్ ఎవరయ్యా అంటే బోయపాటి శ్రీను అనాల్సివస్తోంది. బోయపాటి భుజాలపై ఇప్పుడు రెండు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. అందులో మొదటిది ఆయన గీతాఆర్ట్స్ బేనర్‌లో అల్లుఅర్జున్ హీరోగా ఓ చిత్రం చేయాల్సివుంది. ఇక సీనియర్ స్టార్ బాలకృష్ణ 100వ చిత్రానికి కూడా అయనే దర్శకత్వం వహించాల్సివుంది. వాస్తవానికి బాలయ్యకు 100వ చిత్రం అతి కీలకమైంది కావున ఇప్పటి నుండే ఆస్టోరీపై కూర్చొవాలని బోయపాటిని కోరాడట. ఇప్పటినుండే తన వందో చిత్రంపై కుస్తీ పడాల్సిందిగా ఆయనకు పిలుపువచ్చింది. మధ్యలో ఆయనకు ఈ అల్లుఅర్జున్ సినిమా అనుకోకుండా వచ్చి చేరింది. ఓ వైపు బాలయ్య స్టోరీపై కూర్కొంటే అల్లుఅరవింద్ ఊరుకోడు. ఆయన సినిమా మొత్తం పూర్తయ్యే వరకు ఏ దర్శకుడిని కూడా ఫ్రీగా వదలడు. తమ సినిమా చేసినంత కాలం తమ చిత్రంపైనే దృష్టి పెట్టాలనేది ఆయన పాలసీ. సో... ఇప్పుడు బోయపాటి రెండు ప్రతిష్టాత్మక చిత్రాల నేపథ్యంలో ఇరుక్కుపోయి నానా తంటాలు పడుతున్నాడట...!