Advertisementt

అమెరికాలో అమ్మకానికి సుబ్రహ్మణ్యం....!

Mon 25th May 2015 01:23 PM
pillanuvvu leni jeevitham,sai dharam tej,subrahmanyam for sale  అమెరికాలో అమ్మకానికి సుబ్రహ్మణ్యం....!
అమెరికాలో అమ్మకానికి సుబ్రహ్మణ్యం....!
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ నుండి కొత్తగా వచ్చిన హీరోల్లో సాయిధరమ్‌తేజ్‌ ఒక్కడు. ఆయన నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం ’ మంచి విజయం సాదించి ఆయనకు మంచి పేరుతెచ్చిపెట్టింది. కాగా ఆయన ప్రస్తుతం హరీష్‌శంకర్‌ డైరెక్షన్‌లో దిల్‌రాజు నిర్మాత తెరకెక్కుతోన్న ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన జోడీగా మరోసారి రెజీనా నటిస్తోంది. వేగంగా షూటింగ్‌ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రంషూటింగ్‌ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సాంగ్‌ ఒకటి లీకై ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియో కూడా వివిధ చానెళ్లలో ప్రసారం అవుతోంది. మొత్తానికి ఈ చిత్రం సాయి`హరీష్‌`దిల్‌రాజులకు పెద్ద విజయాన్నే అందిస్తుందనే దీమాలో యూనిట్‌ ఉంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ