ప్రస్తుతం తమిళంలో స్టార్‌హీరో సూర్య నటించిన ‘మాస్’ చిత్రం ఈనెల 29న విడుదలకు సిద్దమవుతోంది. కాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘క్లీన్ యు’ సర్టిఫికేట్ వచ్చింది. ఈ చిత్రం తెలుగులో ‘రాక్షసుడు’ అనే టైటిల్‌తో విడుదలకానుంది. అయితే ఈ చిత్రానికి తమిళంలో పెట్టిన ‘మాస్’ టైటిల్‌ను మార్చారని సమాచారం. తాజాగా ఈ చిత్రానికి ‘మాస్ ఎంగిర మాస్సిలమని’గా మార్చారని తెలుస్తోంది. సాధారణంగా తమిళనాడు రాష్ట్రప్రభుత్వం నుండి సబ్సిడీ పొందాలంటే రెండు నియమాలను పాటించకతప్పడు. అందులో ఒకటి ‘క్లీన్ యు’ సర్టిఫికేట్ పొందడం... రెండోది సినిమా టైటిల్ అచ్చ తమిళంలో ఉండటం ముఖ్యం. అదే టైటిల్ ఇంగ్లీషులో ఉంటే సబ్సిడీ లభించదు. అందుకే ఈ సినిమా టైటిల్‌ను మార్చినట్లు తెలుస్తోంది.