Advertisementt

స్టార్‌ హీరోల వందరోజుల పథకం...!

Mon 25th May 2015 03:54 AM
  స్టార్‌ హీరోల వందరోజుల పథకం...!
స్టార్‌ హీరోల వందరోజుల పథకం...!
Advertisement
Ads by CJ

ఇదేదో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కాదులెండి...! మన స్టార్‌ హీరోలు కొత్తగా తీసుకున్న డెసిషన్‌. ఒకప్పుడు స్టార్‌హీరోతో సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుందో? ఎప్పుడు పూర్తవుతుందో? చెప్పలేని పరిస్థితి. కానీ నేడు మాత్రం మన హీరోలు ఒక్కో సినిమాకు కేవలం 50 రోజుల నుండి 100ల వరకు మాత్రమే కాల్షీట్స్‌ ఇస్తూ.. తమ సినిమాలను తొందరగా పూర్తయ్యేలా ప్లాన్‌చేస్తున్నారు. ఓ చిత్రంలో నటిస్తుండగానే మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ ఒకటి పూర్తయి వెంటనే మరోటి పట్టాలెక్కిస్తున్నారు. షూటింగ్‌ విషయంలో మన స్టార్‌హీరోలు రేసుగుర్రాల్లా పరుగెడుతున్నారు. నిన్నటి నిన్న ‘కిక్‌2’ పూర్తి చేసిన రవితేజ ఆ చిత్రం విడుదలకాకముందే సంపత్‌నంది దర్శకత్వంలో చేస్తున్న ‘బెంగాల్‌టైగర్‌’ షూటింగ్‌ వేగం పెంచేశాడు.ఈ చిత్రాన్ని వినాయకచవితికి థియేటర్లలోకి తేవడానికి కృషి చేస్తున్నాడు. ఇక మహేష్‌బాబు కూడా కొరటాల శివ చిత్రం విడుదల కాకముందే శ్రీకాంత్‌ అడ్డాల చిత్రం షూటింగ్‌ను మొదలుపెడుతున్నాడు. ఈ చిత్రాన్ని 100రోజుల లోపు పూర్తిచేయాలని మహేష్‌ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన 150 వ చిత్రాన్ని ఆగష్టులో పూజ చేసి, సెప్టెంబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. ఈ చిత్రాన్ని కేవలం 75 రోజుల్లో పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక రామ్‌చరణ్‌, శ్రీనువైట్ల చిత్రం ఇటీవలే మొదలైంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 15న విడుదల చేయడానికి ప్లానింగ్‌ చేస్తున్నారు. ఇలా తమ చిత్రాలను మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయడమే కాదు... పక్కాప్లానింగ్‌తో లిమిటెడ్‌ బడ్జెట్‌తో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఫార్ములా ‘టెంపర్‌’ చిత్రానికి బాగా వర్కౌట్‌ అయింది. రాబోయే కాలంలో కూడా మన స్టార్‌హీరోలు ఇదే పాలసీని కొనసాగిస్తారని ఆశిద్దాం....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ