నాని సడన్‌గా పర్‌ప్రైజ్ ఇచ్చేశాడు. సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకొంటుందేమో మరి... ‘భలే భలే మగాడివోయ్’ ఫస్ట్‌లుక్‌ని ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రమిది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. గీతాఆర్ట్స్,యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. మారుతి ‘కొత్తజంట’ తర్వాత సుధీర్ఘ విరామం తీసుకొని ఈ చిత్రాన్ని చేశాడు.
కథల విషయంలో పక్కాగా వ్యవహరించే నాని ఈసారి మరో కొత్త రకమైన సినిమా చేసుంటాడని ప్రేక్షకులు నమ్ముతున్నారు. సోమవారం ఆన్‌లైన్‌లో విడుదలైన ‘భలే భలే మగాడివోయ్’ ఫస్ట్‌లుక్ కూడా మంచి అంచనాల్ని క్రియేట్ చేస్తోంది. చాలా సహజంగా, కూల్‌గా ఫస్ట్‌లుక్‌ని డిజైన్ చేశారు. వచ్చే నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.