టాలీవుడ్‌లో పవన్‌కల్యాణ్, జూ. ఎన్టీఆర్ గడ్డెం పెంచడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సుకుమార్ సినిమా కోసం ఎన్టీఆర్ గడ్డం పెంచుతుండగా.. పవన్ గబ్బర్‌సింగ్-2కోసం గడ్డం పెంచుతున్నారన్న వార్తలు వెలువడ్డాయి. అయితే పవన్ గడ్డం పెంచడానికి వెనుక ఉన్నది గబ్బర్‌సింగ్-2 కథ కాదని.. స్వామి విశ్వంజి అనేది లేటెస్ట్ కథనం.
విశ్వంజీ అనే స్వామిజీ సూచన మేరకు పవన్‌కల్యాన్ ఓ దీక్ష చేస్తున్నట్లు సమాచారం. 42 రోజులపాటు కొనసాగే ఈ దీక్షలో గడ్డెం తీయవద్దన్నది నియమం. దీంతో 42 రోజుల పాటు గడ్డెం తీయకుండా ఉండటంతోనే పవన్‌కల్యాన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ స్వామిజీకి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కూడా భక్తుడట. ఇక పవన్, త్రివిక్రమ్‌ల మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక తన మిత్రుడు త్రివిక్రమ్ గురువునే తన గురువుగా భావించి ఆయన చెప్పినట్లు పవన్ గడ్డం పెంచుతున్నారనే టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.