Advertisementt

ఆ టైటిల్స్‌ శ్రీకాంత్‌ తనయుడి కోసమేనా?

Sat 23rd May 2015 11:24 AM
srikanth,roshan,annapurna studios,titles register,pakka pakkane,nirmala convent  ఆ టైటిల్స్‌ శ్రీకాంత్‌ తనయుడి కోసమేనా?
ఆ టైటిల్స్‌ శ్రీకాంత్‌ తనయుడి కోసమేనా?
Advertisement
Ads by CJ

హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ త్వరలో ఓ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ద్వారా హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంట్రీకి ఇప్పటికే సన్నాహాలు పూర్తవుతున్నాయి. అందునా తన తొలి చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై రూపొందడం ఆయన అదృష్టమనే చెప్పాలి. కాగా ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ రెండు ఆసక్తికర టైటిళ్లను రిజిష్టర్‌ చేయించింది. అవి ‘పక్కపక్కనే’, ‘నిర్మలా కాన్వెంట్‌’. ఈ రెండు టైటిల్స్‌ను రోషన్‌ కోసమే రిజిష్టర్‌ చేయించారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. కాగా రోషన్‌ ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాశాడు. మరి హీరోగా ఆయనకు శ్రీకాంత్‌కు ఉన్న పరిచయాలు బాగా ఉపయోగపడతాయని టాలీవుడ్‌ వాసులు భావిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ