Advertisementt

మంచి అవకాశం సంపాదించిన జూనియర్‌ ఐశ్వర్యారాయ్‌!

Sat 23rd May 2015 08:53 AM
sneha ullal,simha movie,bollywood,saako363,lady oriyanted movie  మంచి అవకాశం సంపాదించిన జూనియర్‌ ఐశ్వర్యారాయ్‌!
మంచి అవకాశం సంపాదించిన జూనియర్‌ ఐశ్వర్యారాయ్‌!
Advertisement
Ads by CJ

ఇంచుమించు ఐశ్వర్యారాయ్‌ పోలికలతో ఉండే స్నేహ ఉల్లాల్‌ నటనపై సరిగ్గా దృష్టిపెట్టకపోవడం, ‘సింహా’ లాంటి విజయాలను సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో టాలీవుడ్‌లో మంచి అవకాశాలు సంపాదించలేకపోయింది. అయితే తనకు బాలీవుడ్‌లో మంచి రోజులు వచ్చాయని ఆమె సంబరపడిపోతోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ‘సాకో 363’ సినిమాపై ఈ అమ్మడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంది. ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె ఓ గిరిజన యువతిగా నటిస్తోంది. ఆమె కెరీర్‌లో ఇదే మొదటి లేడీ ఓరియంటెడ్‌ సినిమా కావడం గమనార్హం. తనలోని నటిని ఇందులో పూర్తిగా బయటకు తెచ్చానని ఆమె సంబరపడిపోతోంది. మరి ఈ చిత్రం ఆమెకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాల్సివుంది....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ