నా పారితోషికం విషయంలో మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను హీరోలతో సమానంగా హీరోయిన్స్‌కు కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఫీలవుతాను. అయితే ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఓ హీరో ఓ చిత్రం ఫినిష్ చేసేలోపు హీరోయిన్లమైన మేము ఓ మూడు సినిమాలు పూర్తిచేస్తాం. కాబట్టి ప్రస్తుతం నాకైతే ఏ రెమ్యూనరేషన్ వస్తుందో దాని పట్ల నేను హ్యాపీగా ఉన్నాను... అంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్. గత కొన్నిరోజులుగా మీడియాలో రకుల్ ఓ చిత్రం కోసం కోటిరూపాయలు డిమాండ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రస్థావన నేరుగా చెప్పకుండా రకుల్ తెలివిగా ఇలా వాటికి సమాధానం ఇచ్చింది. నితిన్ సరసన ఓ కొత్త చిత్రంలో నటించడానికి రకుల్ ఈ మేరకు డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తాత్కాలికంగానైనా మీడియా వార్తలకు రకుల్ చెక్ పెట్టిందనే భావించవచ్చు.