ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘దమ్ము’ చిత్రం వల్ల ఆ చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావుకు భారీగా నష్టం వచ్చింది. అయితే ‘టెంపర్’ చిత్రంతో మరలా ఫామ్‌లోకి వచ్చిన ఎన్టీఆర్ వెనుక చాలా మంది నిర్మాత, దర్శకులు క్యూ కడుతున్నారు. అయితే తనతో సినిమా తీసి నష్టపోయిన కె.ఎస్.రామారావుకు ఎన్టీఆర్ మరో సినిమా చేస్తానని కాల్షీట్స్ ఇచ్చినట్లు సమాచారం. ఆల్‌రెడీ కె.ఎస్.రామారావు దగ్గర సురేందర్‌రెడ్డి డేట్స్ ఉన్నాయి. దాంతో నిర్మాత కె.ఎస్.రామారావు ఎన్టీఆర్‌ను సురేందర్‌రెడ్డిని కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఎన్టీఆర్-సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో ‘అశోక్, ఊసరవెల్లి’ చిత్రాలు వచ్చాయి. అయితే ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులను నిరాశపరిచాయి. మరి మూడో చిత్రంతోనైనా ఎన్టీఆర్‌కు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో సురేందర్‌రెడ్డి ఉన్నాడని సమాచారం.