సూపర్‌స్టార్ కృష్ణ ఇమేజ్ ఆయన కుమారుడైన మహేష్‌బాబుకు అండగా నిలబడింది. కానీ కృష్ణకు ఉన్న క్రేజ్ సీనియర్ నరేష్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. కాగా ప్రస్తుతం నరేష్ కుమారుడు నవీన్‌కృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘ఐనా.. ఇష్టం నువ్వు’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం వేడుకలకు ప్రత్యేకంగా కృష్ణ-విజయనిర్మల దంపతులు హాజరై తమ ఆశీస్సులను అందిస్తున్నారు. అయితే ఘట్టమనేని అభిమానులు మహేష్‌బాబుకు ఇచ్చినంత సపోర్ట్‌ను నవీన్‌కృష్ణకు ఇస్తారా? అనేది చర్చనీయాంశం అయింది. వాస్తవానికి కృష్ణ ఆశీస్సులతో సినీ రంగ ప్రవేశం చేసిన సీనియర్ నరేష్ నుండి సుధీర్‌బాబు వరకు తీసుకుంటే కృష్ణ అభిమానులు కేవలం మహేష్‌బాబు ఒక్కడికే పూర్తిగా తమ మద్దతును ఇచ్చారు. కృష్ణ కుమార్తెకు గానీ, చివరకు రమేష్‌బాబుకు కూడా కృష్ణ అభిమానులు మహేష్‌కు ఇచ్చినంతగా తమ ప్రోత్సాహాన్ని అందించలేదనడం సబబు.....!