ఎంతో కొత్తగా ఉంటుందని చేసిన ‘1’ (నేనొక్కడినే), ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని భావించిన ‘ఆగడు’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలవడంతో మహేష్ తన కెరీర్‌ను చాలా కేర్‌ఫుల్‌గా అడుగులు వేస్తున్నాడు. ‘మిర్చి’ వంటి హిట్ ఇచ్చిన కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ఇక ‘ముకుంద’ చిత్రం యావరేజ్ అయినప్పటికీ తనకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సూపర్‌హిట్టు ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహోత్సవం’ చేస్తున్నాడు. ఆ తర్వాత తనకు కెరీర్‌లో ‘పోకిరి, బిజినెస్‌మేన్’ వంటి సూపర్‌హిట్స్‌ను ఇచ్చిన పూరీ చిత్రంతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి మహేష్ డిసైడ్ అయ్యాడట. తన కెరీర్‌కు కీలకమైన ఇలాంటి పరిస్థితుల్లో ప్రయోగాలు, కొత్తవారితో పనిచేయడం వంటివి రిస్క్‌లుగా భావిస్తోన్న మహేష్ సేఫ్‌గేమ్ ఆడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.