పవన్‌కళ్యాణ్ సరసన ‘పులి’ చిత్రంలో నటించి ఆ తర్మాత కనుమరుగైన హీరోయిన్ నికిషాపటేల్. ‘పులి’ చిత్రం ఫ్లాప్ కావడంతో ఆమెకు ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. దాంతో తమిళం, కన్నడ చిత్రాల్లో అడపాదడపా నటిస్తూ తన కెరీర్‌ను లాగిస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘నారదన్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. ఇందులో ఆమె ‘షార్ట్ టైం మెమరీ డిజార్డర్’ అనే వ్యాధితో అంటే ‘గజిని’లో సూర్యలా బాధపడుతూ ఉంటుందిట. ఈ చిత్రం తన కెరీర్‌ను టర్న్ చేస్తుందని, మరలా ఈ చిత్రంతో తనకు స్టార్‌హీరోల సరసన నటించే అవకాశాలు వస్తాయనే నమ్మకంతో నికిషాపటేల్ ఉంది. మరి ఆమె కోరిక నెరవేరుతుందో లేదో వేచిచూడాల్సివుంది....!