తెలుగులో యమా స్పీడ్‌గా సంగీతాన్ని అందించే ఇన్‌స్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ పేరును చెప్పుకోవాలి. ఎలాంటి బాణీలు ఇస్తాడు అనే విషయం పక్కనపెడితే ఆయన జెట్ వేగంతో తాను ఒప్పుకున్న చిత్రాలకు సంగీతం అందిస్తాడు. తాజాగా ఆయన అల్లుఅర్జున్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో గీతాఆర్ట్స్ బేనర్‌పై రూపొందుతున్న చిత్రానికి బాణీలందించే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలోని మొత్తం ఐదు పాటలకు గాను ఆయన ఆల్‌రెడీ మూడు బాణీలను ఓకే చేయించాడని, ఈ ట్యూన్స్ అల్లుఅరవింద్‌కు కూడా నచ్చడంతో త్వరలో ఇండియా రానున్న బన్నీ కూడా ఓకే చేసిన వెంటనే వీటికి రాజముద్ర పడనుంది. మరోవైపు తమన్ ‘కిక్2’ చిత్రం రీరికార్డింగ్‌లో కూడా బిజీగా ఉన్నాడు. బాణీలకు,రీరికార్డింగ్‌లకు ఎక్కువ సమయం తీసుకొని అందరినీ ఇబ్బంది పెట్టకుండా తను చెప్పిన సమయానికి పూర్తి చేయడం ఆయన కెరీర్ ఇంకా వేగంగా సాగడానికి ముఖ్యకారణంగా ఒప్పుకోవాలి...!