Advertisementt

శృతికి మరో మంచి ఆఫర్‌!

Tue 19th May 2015 03:39 PM
shruthi hassan,suriya,singam 2,anushka,singam 3 movie  శృతికి మరో మంచి ఆఫర్‌!
శృతికి మరో మంచి ఆఫర్‌!
Advertisement
Ads by CJ

తమిళంలో ఇప్పటికే స్టార్‌ హీరోలందరి తరపున నటిస్తున్న శృతిహాసన్‌కు తాజాగా మరో మంచి ఆఫర్‌ వచ్చినట్లు సమాచారం. గతంలో స్టార్‌ హీరో సూర్య, దర్శకుడు హరిల కాంబినేషన్‌లో ‘సింగం, సింగం2’ చిత్రాలు వచ్చి ఘనవిజయం సాధించాయి. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘సింగం3’ తీసేందుకు సూర్య అంగీకారం తెలపడంతో దర్శకుడు హరి ఈ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో అనుష్క లీడ్‌రోల్‌ పోషించనుండగా, శృతిహాసన్‌ మరో హీరోయిన్‌గా ఎంపికైంది. మరి ఈ చిత్రం ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని కోలీవుడ్‌లో వర్గాలు అంటున్నాయి. గత రెండు చిత్రాల వలే ఈ చిత్రం కూడా సెన్సేషన్‌ సృష్టించే అవకాశం ఉందనే నమ్మకాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ