క్రికెటర్ యువరాజ్‌సింగ్, సినీ నటుడు బాలకృష్ణలు చేతులు కలిపారు. అయితే వారిద్దరూ కలిసింది ఓ చారిటీ మ్యాచ్ కోసమో.. సినీ రంగానికి సంబంధించిన విషయం కోసమో కాదు. ప్రాణాలు తీసే క్యాన్సర్‌ను ఎదుర్కొనడానికి.
క్యాన్సర్ బారినపడిన యువరాజ్‌సింగ్ చావు అంచుల దాక వెళ్లి తిరిగివచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో బసవతారక క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గా బాలకృష్ణ కూడా క్యాన్సర్ ఎదుర్కొనడానికి పోరాటం చేస్తున్నారు. ఇక క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి వీరిద్దరూ చేతులు కలిపారు. క్యాన్సర్ బాధితులను ఆదుకోవడానికి యువరాజ్‌సింగ్ ఏర్పాటుచేసిన 'యూవీకెన్' సంస్థ, బసవతారక ఆస్పత్రి ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి ప్రజల్లో క్యాన్సర్‌పై అవేర్‌నెస్‌ను పెంచే కార్యక్రమాలు రూపొందించనున్నాయి. అటు క్రికెట్‌లో బిజీగా ఉన్న యువరాజ్ ఇటు సినిమాల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ క్యాన్సర్ బాధితుల సాయార్థం కార్యక్రమాలు రూపొందించడానికి ముందుకు రావడం అభినదించదగ్గ విషయమే.