Advertisementt

నయనతారతో తన వివాహం జరగలేదట..!!

Tue 19th May 2015 12:26 AM
nayanatara,marriage,shivam,kocchin  నయనతారతో తన వివాహం జరగలేదట..!!
నయనతారతో తన వివాహం జరగలేదట..!!
Advertisement
Ads by CJ

నయనతారాకు పెళ్లి అయ్యిందంటూ ఇటీవలే తమిళ మీడియా కోడై కూసింది. ప్రముఖ దర్శకుడు శివంను ఆమె రహస్యంగా వివాహమాడినట్లు వార్తలు వెలువడ్డాయి. కొచ్చిన్‌లో ఓ చర్చిలు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ వారి వివాహం జరిగిపోయిందని మీడియాలో వార్తలు వచ్చి ఆమె అభిమానులను షాక్‌కు గురిచేశాయి. అయితే నయనతారా, తనకు వివాహం జరగలేదని దర్శకుడు శివం స్పష్టం చేశారు.

వివాహానికి సంబంధించిన వదంతులకు పులిస్టాప్‌ పెడుతూ దర్శకుడు శివం తన ట్విట్టర్‌ ఎకౌంట్‌ ద్వారా స్పష్టతనిచ్చాడు. నయనతారతో తన వివాహం జరిగిందన్న వార్తలో నిజం లేదని, అదో పిచ్చి వార్త అని ప్రకటించాడు. ఇలాంటి వదంతులతో తమకు నష్టం జరుగుతుందని, ఈ వదంతులను అభిమానులు నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు. అయితే నయనతార మాత్రం ఈ వార్తలపై స్పందించకపోవడం గమనార్హం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ