Advertisementt

‘బాహుబలి’లో అది నచ్చలేదంటున్న ప్రభాస్‌

Mon 18th May 2015 12:00 PM
ss rajamouli,bahubali,prabhas,keeravani,bahubali on 10th july  ‘బాహుబలి’లో అది నచ్చలేదంటున్న ప్రభాస్‌
‘బాహుబలి’లో అది నచ్చలేదంటున్న ప్రభాస్‌
Advertisement
Ads by CJ

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో రూపొందుతున్న ‘బాహుబలి’ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జూలై 10న రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. భారీ సెట్టింగులతో, అబ్బుర పరిచే గ్రాఫిక్స్‌తో చాలా రిచ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని ప్రధాన క్యారెక్టర్ల గెటప్స్‌ను ఒక్కొక్కటిగా రిలీజ్‌ చేస్తూ ఆడియన్స్‌లో ఈ సినిమాపై వున్న క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాడు రాజమౌళి. తెలుగు, తమిళ్‌, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులే కాదు భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తోంది. అపజయం అనే మాట ఎరుగని రాజమౌళి ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న ప్రభాస్‌ మాత్రం ‘బాహుబలి’ చిత్రం గురించి నోరు జారాడని తెలిసింది. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘బాహుబలి’ ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కంటే, రాజమౌళి మొదటి చిత్రం ‘స్టూడెంట్‌ నెం.1’లోని ట్విస్ట్‌ తనకు బాగా నచ్చిందని చెప్పాడట. ఇప్పటివరకు ‘బాహుబలి’ చిత్రం గురించి ఎలాంటి కామెంట్స్‌గానీ, కాంప్లిమెంట్స్‌గానీ ఇవ్వని ప్రభాస్‌ ఇలా మాట్లాడడం కొత్త ఆలోచనలు రేకెత్తిస్తోంది, బయ్యర్లు భయపడేలా చేస్తోంది. ప్రభాస్‌ ఏ ఉద్దేశంతో ఆ మాట అని వుంటాడో తెలీదుగానీ న్యూస్‌ మాత్రం నెగెటివ్‌గానే స్ప్రెడ్‌ అవుతోంది. దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ