Advertisementt

చిరు ఆశలన్నీ..పూరీ సెంటిమెంట్‌పైనే!

Mon 18th May 2015 11:29 AM
chiranjeevi,puri jagannath,chiranjeevi 150th movie   చిరు ఆశలన్నీ..పూరీ సెంటిమెంట్‌పైనే!
చిరు ఆశలన్నీ..పూరీ సెంటిమెంట్‌పైనే!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవి... ఈయన పేరు చెబితేనే బాక్సాఫీస్‌లన్నీ బద్దలవుతాయి. ఆయన మంత్రం మాస్‌. ఆయన ఫ్యాన్స్‌ ఆయన సై అంటే దేనికైనా రెడీ అంటారు. ఆయన సినిమాల్లో కనిపించి ఎనిమిదేళ్లు అవుతోంది. మధ్యలో రాజకీయాలు. మరలా ప్రస్తుతం తన 150వ చిత్రంతో రీఎంట్రీ. ఆ బాధ్యతలను కూడా చిరు ఏరికోరి పూరీజగన్నాథ్‌ భుజాల మీద పెట్టాడు. అయితే ఇక్కడే ఓ సెంటిమెంట్‌ దాగి ఉంది. పూరీ దర్శకత్వంలో మొదటిసారిగా నటించిన మెగా హీరోలందరూ మంచి విజయాలను అందుకున్నారు. పవన్‌కళ్యాణ్‌తో ఆయన చేసిన మొదటి చిత్రం ‘బద్రి’ పెద్ద హిట్‌. ఇక అల్లుఅర్జున్‌ హీరోగా ఆయన చేసిన ‘దేశముదురు’ సూపర్‌హిట్టు. ఇక రామ్‌చరణ్‌ను పరిచయం చేస్తూ పూరీ తీసిన ‘చిరుత’ ఆయన కెరీర్‌కు బిగినింగే అద్బుతం అనే విధంగా తీశాడు. కాగా ఇప్పుడు ఆయన మెగాస్టార్‌ను మొదటిసారిగా డైరెక్ట్‌ చేయనున్నాడు. సో.. సెంటిమెంట్‌పరంగా మెగాస్టార్‌ చిత్రం సైతం సూపర్‌హిట్టే అని అభిమానుల నమ్మకం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ