వివాదాలతో ఎప్పూడు వార్తల్లో ఉండే వారిలో తమిళ కమెడియన్ వడివేలు ఒకరు. ఆమధ్య అన్నాడీఎంకె పార్టీ తరుపున ప్రచారం చేసిన వడివేలు రజనీకాంత్‌తో సహా కొందరు నటీనటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే ఆయన నటించిన ‘తెనాలిరామన్’ అనే చిత్రం కూడా వివాదాల్లో చిక్కుకొంది. తాజాగా ఆయన ‘ఎలి’ చిత్రంలో నటిస్తున్నాడు. కాగా ఇటీవల వడివేలు మాట్లాడుతూ... ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు తిట్టేస్తున్నారు. వరసగా చిత్రాలు చేయడంలేదనేది వారి బాధ. నేను రాజకీయాల్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది... అంటూ చెప్పుకున్నాడు. అంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.