‘కిస్’ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన ప్రియబెనర్జీ ఇప్పుడు నారారోహిత్ హీరోగా నటిస్తున్న ‘అసుర’ చిత్రంలో నటిస్తోంది. స్పైసీగా ఉండే ఈ ఎన్నారై భామ రీసెంట్‌గా జరిగిన ‘అసుర’ ఆడియో వేడుకకు హాజరుకాలేదు. ఈ సందర్భంగా ఆమె తన అభిమానులకు క్షమాపణలు చెబుతూ... వీడియోను విడుదల చేసింది. ఇందులో ప్రియాబెనర్జీ మాట్లాడుతూ... ‘నేను ‘అసుర’టీమ్‌కు, అభిమానులకు ఆడియో లాంచ్‌కు రానందుకు క్షమాపణలు చెబుతున్నాను. కొన్ని వ్యక్తిగత పనుల వల్ల నేను కెనడాలో స్ట్రక్ అయిపోయాను. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అలాగే నారారోహిత్ మంచి కో యాక్టర్. డౌన్ టు ఎర్త్ ఉండే వ్యక్తిత్వం గల అతనితో పనిచేయడం చాలా సులభం. నేను నా ప్రేమను, సపోర్ట్‌ను పంపుతూ కంగ్రాట్స్ చెబుతున్నానంటూ ఫ్లయింగ్ కిస్ వదిలింది. ‘అసుర’.. గుడ్ ఈజ్ బ్యాడ్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో నారారోహిత్ జైలర్‌గా నటించాడు. ఒక రాక్షసుడి పేరును హీరోకి పెట్టడమే ఆసక్తిని కలిగిస్తోంది.