మంచు లక్ష్మి బహుముఖ ప్రజ్ఞశాలిగా పేరు తెచ్చుకుంటోంది. అటు నటిగా ఇటు ప్రొడ్యూసర్‌గానే కాకుండా యాంకర్‌గా కూడా ఇదివరకే ఆమె ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇదివరకు లక్ష్మి మంచు 'లక్ష్మి టాక్‌షో', 'ప్రేమతో మీ లక్ష్మి' వంటి టాక్‌షోల్లో పార్టిసిపేట్ చేసింది. తాజాగా మరో టాక్‌షోతు మంచు లక్ష్మి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
మంచు లక్ష్మి లేటెస్ట్ టాక్‌షో పేరు 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు'. ఇప్పటికే ఈ ప్రోగ్రాంకు సంబంధించి ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. మే25న ఈ టాక్‌షో షూటింగ్ ప్రారంభమవనున్నట్లు సమాచారం. ఇక జూన్ 1నుంచి ప్రముఖ చానల్‌లో ఈ ప్రోగ్రాం ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మే 20న జరగనున్న మంచు మనోజ్ పెళ్లి కోసం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంచు ఫ్యామిలీ మెంటర్లంతా ప్రస్తుతం మనోజ్ పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.