వర్మ సినిమాలే కాదు.. ఈ మధ్య ట్విట్టర్‌లో ఆయన పోస్టింగ్స్‌కు కూడా సాధారణ జనాలకు అర్థంకావడం లేదు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌పైన ఆయన తాజాగా ఓ వ్యాఖ్య చేశారు. కేసీఆర్ ఇలియానా కంటే కూడా అందంగా ఉంటారని, అయితే ఈమధ్య నిత్యమీనన్ కంటే కూడా అద్భుతంగా నటిస్తున్నారని రాసుకొచ్చారు. దీన్నిబట్టి ఇలియానా అందంగా ఉన్న నటించలేరని, నీత్యమీనన్ మంచి నటీమణి అని వర్మ చెప్పినట్లు అర్థమవుతోంది. ఇక కేసీఆర్ అందాన్ని ఇలియానాతో పోల్చిన వర్మ ఆయన నటన నిత్యామీనన్ కంటే అద్భుతం అన్నారు. అయితే ఏ విషయంలో కేసీఆర్ నటించారన్న దానిపై మాత్రం స్పష్టతనివ్వలేదు.
మరోవైపు రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే కూడా వేగంగా వర్మ సినిమాలు తీస్తున్నాడు. ఆ సినిమాల షూటింగ్ ఎంత వేగంగా పూర్తవుతుందో అంతకంటే వేగంగా అవి థియేటర్లనుంచి మాయమవుతున్నాయి. అయితే ఆదాయపరంగా మాత్రం అన్ని సినిమాలు ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చిపెట్టేలా వర్మ జాగ్రత్తపడుతున్నాడు. ఇక రూ.7కోట్లతో రూపొందుతున్న 'మొగలిపువ్వు' సినిమా అటు తెలుగు ఇటు హిందీలోనూ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో రిలీజ్‌కు ముందే ఇది ప్రొడ్యూసర్‌కు లాభాలు తెచ్చిపెడుతుందన్న టాక్ వినిపిస్తోంది.