నటి నీతూ అగర్వాల్ పీకల్లోతూ కష్టాల్లో మునిగిపోయారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన ఈమె ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక బెయిల్‌కు సంబంధించి సంతకం చేయడానికి రుద్రవరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన నీతూ అగర్వాల్ అక్కడ విలేకరులతో మాట్లాడుతూ తన బాధను వెళ్లగక్కారు. స్మగ్లర్ మస్తాన్‌వలీ తనను ప్లాన్ ప్రకారమే మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తనకు ఏమీ అక్కరలేదని, తిరగి తన కుటుంబ సభ్యులు తనను ఆదరిస్తే చాలునని చెప్పారు. అంతేకాకుండా తనను మస్తాన్‌వలీ హత్య చేస్తాడేమోనన్న ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఏం జరిగినా మస్తాన్‌వలీదే బాధ్యత అని చెప్పారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తనకు జీవితంపై విరక్తి పుట్టిందని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నీతూ అగర్వాల్ బ్యాంకు ఎకౌంట్ ద్వారానే మస్తాన్ స్మగ్లర్లకు డబ్బులు చెల్లించేవాడు. అయితే ఈ విషయం తనకు తెలియదని నీతూ అగర్వాల్ చెబుతోంది.