కథానాయిక ఛార్మి ఈ రోజు పుట్టినరోజు జరుపుకోబోతోంది. అప్పుడే కానుకల వెల్లువ మొదలైంది. ఆమెకి నిర్మాత సి.కళ్యాణ్ లయన్ షేప్‌లో ఉన్న డైమండ్ రింగ్‌ని కానుకగా ఇచ్చారు. ఆ రింగ్ చాలా కాస్ట్లీ అని సమాచారం. తనకి లభించిన గిఫ్ట్ గురించి ట్విట్టర్‌లో ఆనందంగా షేర్ చేసుకొంది ఛార్మి. కళ్యాణ్ అంత భారీ గిఫ్ట్ ఇవ్వడానికి ఓ బలమైన కారణమే ఉంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న `జ్యోతిలక్ష్మి`కి సి.కళ్యాణ్ నిర్మాత కావడం వెనక కారణం ఛార్మినేనట. మొదట ఈ చిత్రాన్ని ఛార్మి సొంతంగానే నిర్మించాలనుకొన్నారు. అయితే సి.కళ్యాణ్ నేనూ సినిమాలో భాగం కలుస్తానని చెప్పాడట. దీంతో ఛార్మి ఓకే చెప్పేసింది. ఆ రకంగా ఓ మంచి ప్రాజెక్ట్‌కి నిర్మాత అయ్యే ఛాన్స్ ఇచ్చినందుకుగానూ కృతజ్జతగా ఛార్మికి ఈ గిఫ్ట్ ఇచ్చినట్టు సమాచారం. ఛార్మి కథానాయికగా నటించిన `జ్యోతిలక్ష్మి` క్రేజీ ప్రాజెక్ట్‌గా మారిపోయింది. ఆ సినిమాకి అప్పుడే క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ఛార్మి పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం టీజర్‌ని విడుదల చేస్తారు.