Advertisementt

'బ్రూస్ లీ'గా రామ్ చరణ్?

Fri 15th May 2015 11:59 AM
bruce lee,my name is raju,ram charan bruce lee,srinu vytla,mega power star  'బ్రూస్ లీ'గా రామ్ చరణ్?
'బ్రూస్ లీ'గా రామ్ చరణ్?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో డివివి దానయ్య ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ స్టంట్ మ్యాన్ పాత్రలో నటిస్తున్నాడు. షూటింగులు ఎలా జరుగుతాయి..? ఫైట్స్ ఎలా చిత్రీకరిస్తారు..? తదితర అంశాలతో కథ, కథనం ఉంటాయి. యాక్షన్ సన్నివేశాలలో హీరోలకు డూప్ క్యారెక్టర్లో రామ్ చరణ్ కనిపిస్తాడు. తన పాత్రలో మరొకరు డూప్ గా నటించడం ఇష్టం లేని చరణ్.. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. ఈ చిత్రానికి 'మై నేమ్ ఈజ్ రాజు' టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు కొత్త టైటిల్ వినిపిస్తుంది. కథానుగుణంగా 'బ్రూస్ లీ' అనే టైటిల్ బాగుంటుందని చిత్ర బృందం భావిస్తుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.   రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ నెలలో పాటల చిత్రీకరణ కోసం యూనిట్ ఫారిన్ వెళ్తుంది. రకుల్, చెర్రీలపై రెండు పాటలను చిత్రీకరిస్తారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ