పూరీజగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న ‘ఆటోజానీ’ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తాడా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వాస్తవానికి ఈ చిత్రంలో చిరంజీవి మొదటి పాత్ర ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పోలిన పాత్రను పోషిస్తున్నాడని, ఈ కథ 1940-1950 కాలం మధ్యలో సాగుతుందని సమాచారం. ఇక రెండో పాత్ర ‘ఆటోజాని’. ఈ పాత్ర నేటిరోజులకు సంబంధించిన పాత్ర అంటున్నారు. ఈ చిత్రం ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఉయ్యాలవాడ నరిసింహారెడ్డిని పోలిన పాత్ర అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.