త్వరలో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చిరు తనయుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మించనున్నాడు. అయితే ఈ విషయం తెలిసినప్పటికీ పలువురు నిర్మాతలు తామే చిరు 150వ చిత్రం నిర్మిస్తామని చరణ్‌ను కలిసి వేడుకున్నారట. అయితే చరణ్‌తో పాటు చిరు కూడా ఆయా నిర్మాతలను సముదాయించి... తాను చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న చిత్రం ఇదని, మెగాస్టార్ స్టామినా అందరికీ తెలిసినప్పటికీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను ఈ చిత్రం చేస్తున్నందున ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చెప్పలేమని, అందులోనూ ఇది దాదాపు 30 నుండి 40కోట్లకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఎలాంటి రిస్క్ చేయవద్దని తామే తమ చిత్రాన్ని సొంతంగా తీసి రిస్క్ చేస్తామని, కావాలంటే తన 151వ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఇస్తామని సలహా ఇచ్చి నిర్మాతలను సముదాయించారట. మన చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చే వారు టాలీవుడ్ హీరోల్లో ఎందరో ఉన్నారు. కానీ నిర్మాతల సేఫ్టీ గురించి ఇంతలా ఆలోచించిన మెగాస్టార్ చిరంజీవిని, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ను ఇప్పుడు అందరూ ముక్తకంఠంతో పొగుడుతున్నారు.