Advertisementt

మంచి రేటు పలికిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’!

Fri 15th May 2015 03:29 AM
yevade subramanyam movie,satellite rights,nani,priyanka dutt,gemini tv  మంచి రేటు పలికిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’!
మంచి రేటు పలికిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’!
Advertisement
Ads by CJ

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ కుమార్తె ప్రియాంకాదత్‌ స్వప్న సినిమా పతాకంపై నిర్మించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం కొద్ది నెలల కిందట విడుదలైంది. శేఖర్‌కమ్ముల శిష్యుడు నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో నాని, మాళవికానాయర్‌లు జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మంచి టాక్‌ వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద మాత్రం బిలో యావరేజ్‌ చిత్రంగా నిలిచింది. ఇప్పుడీ చిత్రం శాటిలైట్‌ రైట్స్‌ అమ్ముడయ్యాయి. జెమిని టీవీ చానెల్‌ 3.90కోట్లకు ఈ హక్కులను చేజిక్కించుకుంది. దీంతో చూసుకుంటే లోబడ్జెట్‌తో తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నిర్మాతకు సేఫ్‌ ప్రాజెక్ట్‌గానే మిగిలిందని ట్రేడ్‌వర్గాలు అంటున్నాయి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ