అనుష్కతో పివిపి సంస్థ ప్రస్తుతం ‘సైజ్‌జీరో’ చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఇదే సంస్థ గతంలో అనుష్కతోనే సెల్వరాఘవన్ డైరెక్షన్‌లో ‘వర్ణ’ అనే భారీ చిత్రాన్ని నిర్మించింది. కాగా ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం పాలైంది. అయితే ‘వర్ణ’ చిత్రంతో ఆ సినిమాకు వచ్చిన నష్టాన్ని కొంతైనా తగ్గించేందుకు గాను అనుష్క ‘సైజ్‌జీరో’ చిత్రాన్ని అతి తక్కువ పారితోషికం తీసుకొని చేస్తోందిట. ఇక ఆమెను చూసి ‘వర్ణ’లో హీరోగా నటించిన ఆర్య సైతం ‘సైజ్‌జీరో’ చిత్రానికి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని చేస్తున్నట్లు తెలుస్తోంది.