Advertisementt

హన్సిక పెద్దమనసు!

Thu 14th May 2015 10:39 PM
hansika,hansika motwani,nepal relif fund,kulumanali,bank balance  హన్సిక పెద్దమనసు!
హన్సిక పెద్దమనసు!
Advertisement
Ads by CJ

డబ్బు చాలామందికి ఉంటుంది. అయితే అది నలుగురికి ఉపయోగపడేలా...సామాజిక కార్యక్రమాలకు ఖర్చుపెట్టే గుణం కొందరికే ఉంటుంది. అలాంటి అరుదైన సెలబ్రిటీల్లో ముందువరుసలో నిలుస్తుంది  హీరోయిన్‌ హన్సిక. తన కెరీర్‌ తొలి నాటి నుండి తనకు చేతనైనంతలో ఆమె సహాయం చేస్తూనే ఉంది. తాజాగా ఆమె నేపాల్‌ రిలీఫ్‌ ఫండ్‌కు ఆరులక్షలు డొనేట్‌ చేసింది. ఇలా ఆమె చాలామందికి స్ఫూర్తిని ఇస్తోంది. ఇప్పటికే హన్సిక కొందరు అనాథ పిల్లల ఆలనాపాలనా చూసుకుంటోంది. దక్షిణాదిన వరుస చిత్రాలు చేస్తూ  బ్యాంక్‌బ్యాలెన్స్‌ పెంచుకుంటోన్న హన్సిక సేవా కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. హన్సిక ఇప్పటికే కొంతమంది పిల్లలను దత్తత తీసుకొంది. పిల్లలందరూ తల్లిదండ్రుల సమక్షంలోనే ఉంటారు. కాకపోతే వారి ఆలనాపాలనా, చదువుకు అయ్యే ఖర్చులన్నీ మాత్రం హన్సిక భరిస్తుంది. తాజాగా ఈ పిల్లలను హన్సిక హాలీడే ట్రిప్‌గా కులుమనాలికి తీసుకెళ్లే ప్లాన్‌ చేస్తోంది. ఎంతైనా ఈ విషయంలో హన్సికను ఎంత పొగిడినా తక్కువే అని చెప్పాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ