Advertisementt

పూరీ కి ఇంత అదృష్టమా!

Thu 14th May 2015 09:41 PM
puri jagannadh,ram charan,chirutha,puri jagan lucky,chiranjeevi 150th movie  పూరీ కి ఇంత అదృష్టమా!
పూరీ కి ఇంత అదృష్టమా!
Advertisement
Ads by CJ

చిన్నప్పుడు చిరంజీవి సినిమాలను విపరీతంగా చూసి ఆయన ఇన్‌స్పిరేషన్‌తో డైరెక్టర్లు అయిన చాలామందిని మనం ఫిల్మ్‌నగర్‌లో చూడవచ్చు.అలా వచ్చిన వాడే పూరీజగన్నాథ్‌ కూడా. ఆయనంటే మెగాహీరోలకు మరీ ముఖ్యంగా నాగబాబుకు బాగా నమ్మకం. ఇక చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లు సైతం ఆయన్ను బాగా అభిమానిస్తారు. చిరంజీవి ఎంతో నమ్మకంతో తన తనయుడు రామ్‌చరణ్‌ నటించిన తొలిచిత్రం ‘చిరుత’ దర్శకత్వబాధ్యతలను పూరీకే అప్పగించాడు. ఆ నమ్మకాన్ని పూరీ నిలబెట్టుకున్నాడు. మరీ మొదటి సినిమాతోనే అభిమానుల భారీ అంచనాలను ముందుగా ఊహించి అది అనర్థాలకు దారి తీయకుండా ఎక్కడా ఎక్కువ తక్కువలు లేకుండా రామ్‌చరణ్‌ను ఆయన కరెక్ట్‌గా లాంచ్‌ చేయగలిగాడు. వాస్తవానికి ఈమధ్యకాలంలో పూరీ పెద్దగా సక్సెస్‌ల్లో లేడు. చివరకు నితిన్‌తో కూడా ఆయన సినిమా చేయాల్సివచ్చింది. చిన్న హీరో అయినా పెద్దహీరోని అయినా తనదైన పంథాలో చూపించి,విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్‌ సృష్టించడం పూరీకే సాధ్యం. ‘హార్ట్‌ఎటాక్‌’ తర్వాత ఆయన ఎన్టీఆర్‌తో ‘టెంపర్‌’ చిత్రం చేశాడు. ఈ చిత్రం ఎన్టీఆర్‌కే కాదు.. పూరీకి కూడా మంచి పేరుతెచ్చిపెట్టింది. అయినా కూడా చిరు పూరీపై ఉన్న నమ్మకంతోనే తన 150వ చిత్రం చాన్స్‌ ఇవ్వడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది. చిరు కావాలంటే రాజమౌళి నుండి శంకర్‌ వరకు డైరెక్టర్లందరూ  లైన్‌లో ఉంటారు. కానీ చిరు మాత్రం ఏరికోరి పూరీకి గొప్పఅవకాశం ఇచ్చాడనే చెప్పాలి.....!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ