హిట్‌అండ్ రన్ కేసునుంచి కాస్త ఊరట దక్కించుకున్న సల్మాన్‌కు ఆ సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. బాలీవుడ్ బ్యాడ్‌బోయ్‌గా పేరొందిన సల్మాన్‌పై ప్రస్తుతం రెండు కేసులు కొనసాగుతున్నాయి. ఇందులో ఒకటి ముంబైలోని హిట్‌అండ్‌రన్ కేసు కాగా.. మరొకటి రాజస్తాన్‌లో కృష్ణ జింకలను వేటాడిన కేసు. ఇప్పుడు కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ కూడా వేగం పుంజుకోవడంతో సల్మాన్‌కు ఏ సమయంలోనైనా చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
1998లో రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో సల్మాన్‌ఖాన్ కృష్ణ జింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఐదుగురు సాక్ష్యులు ఇప్పటికే జోద్‌పూర్ సెషన్స్ కోర్టులో తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. అయితే ఆ ఐదుగురు సాక్ష్యుల వాంగ్మూలాన్ని తిరిగి నమోదు చేయాలని సల్మాన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. గురువారం ఈ విషయమై తీర్పు వెలువరించిన సెషన్స్ కోర్టు సాక్ష్యులను తిరిగి విచారించడానికి నిరాకరించింది. దీంతో ఈ కేసులో ప్రాసిక్యూషన్, డిఫెన్స్‌ల లాయర్ల వాదోపవాదాలు దాదాపు ముగిసినట్లే. దీంతో ఈ కేసు విచారణ మరింత వేగం పుంజుకోనుంది. మరోవైపు సాక్ష్యుల పునర్ విచారణపై తాము హైకోర్టుకు వెళుతామని సల్మాన్ తరఫు లాయర్ హెచ్‌ఎం సారస్వత్ తెలిపారు.