పూరీజగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించే చిత్రం ఆయన పుట్టినరోజు కానుకగా ఆగష్టు 22న ప్రారంభంకానుంది. అదే సమయంలో ఆయన 60ఏళ్లు పూర్తిచేసుకొని షష్ఠి పూర్తికి సిద్దం అవుతున్నాడు. సో... ఈ రెండు వేడుకలను వెరీవెరీ స్పెషల్‌గా నిర్వహించే యోచనలో మెగాఫ్యామిలీతో పాటు మెగాభిమానులు కూడా ఉన్నారు. ఈ రెండు వేడుకలను ఆయన పుట్టిన మొగల్తూరులో జరపడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రాబోయే చిరు పుట్టినరోజు పండగ ఎందరికో ఎన్నో మధురమైన అనుభూతులను మిగల్చనుందనేది మాత్రం వాస్తవం.