Advertisementt

ఇంతకీ వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతుందా?

Thu 14th May 2015 06:16 AM
katrina kaif,ranbhir kapoor,katrina marriage with ranbhir kapoor  ఇంతకీ వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతుందా?
ఇంతకీ వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతుందా?
Advertisement
Ads by CJ

కత్రినా కైఫ్‌కి బాలీవుడ్‌లో ఎంత క్రేజ్‌ వుందో, రణబీర్‌ కపూర్‌కి ఎంత ఫాలోయింగ్‌ వుందో అందరికీ తెలిసిందే. మరి వీరిద్దరికీ పెళ్ళి జరుగుతోందంటే అంతకు మించిన హాట్‌ టాపిక్‌ ఏం వుంటుంది? రణబీర్‌, కత్రినా వచ్చే సంవత్సరం పెళ్ళి చేసుకోబోతున్నారని, ఈ సంవత్సరం మే 15న అంటే రేపు ఎంగేజ్‌మెంట్‌ జరగబోతోందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, మా ఇద్దరికీ పెళ్ళి చేసుకునే ఉద్దేశమే లేదని, ఈ వార్త ఎలా బయటికి వచ్చిందనేది తనకు తెలియదని కత్రినా అమాయకంగా చెప్తోంది. ఇక రణబీర్‌ని ఈ విషయం అడిగితే తాము పెళ్ళి చేసుకోబోయేది నిజమేనని, వచ్చే సంవత్సరం వుంటుందని పాత పాటే పాడుతున్నాడు. విరుద్ధమైన సమాధానాలు చెప్తున్న వీరిద్దరికీ నిజంగా పెళ్ళి జరుగుతుందా లేదా అనే డౌట్స్‌ బాలీవుడ్‌ సినీ వర్గాల్ని వెంటాడుతున్నాయి. సల్మాన్‌తో కొన్నాళ్ళు చెట్టా పట్టాలేసుకొని తిరిగిన కత్రినా కొంతకాలంగా రణబీర్‌తో సహజీవనం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ