మన భారతీయ సంస్కృతిలోనే కాదు, హిందూ సంప్రదాయమున్న ఏ దేశంలోనైనా దేవాలయాలను ఎంతో పవిత్రంగా చూస్తారు. ఎంత పవిత్రంగా చూస్తారంటే కొన్ని ప్రాంతాల్లో వేరే మతం వారికి హిందూ దేవాలయంలోకి ప్రవేశం లేదు అని కూడా చెప్తారు. ఈమధ్యకాలంలో మీడియా పెరిగిపోవడంవల్ల సెలబ్రిటీలు ఏ చిన్న పొరపాటు చేసినా క్షణాల్లో ప్రపంచమంతా తెలిసిపోతుంది. ఎవరు తెలిసినా, తెలియకపోయినా సన్ని లియోన్ అంటే తెలియనివారు లేరు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో కూడా అందరికీ తెలుసు. అలాంటి సన్ని లియోన్‌కి ముంబాయిలోని వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఘన స్వాగతం లభించింది. ఆమెను ఎంతో గౌరవంగా గుడిలోకి ఆహ్వానించి పూజలు నిర్వహించారు దేవాలయ సిబ్బంది. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే మతంతో సంబంధం లేకుండా అన్ని మతాలకు సంబంధించిన భక్తి గీతాలను పాడి భక్తి పాటలకే కొత్త అందాన్ని తీసుకొచ్చిన గాయకుడు కె.జె.ఏసుదాస్. అతను క్రిస్టియన్ అవడంవల్ల అతన్ని హిందూ దేవాలయంలోనికి అనుమతించలేదు. అలాగే ఆమధ్య హీరోయిన్ మీరా జాస్మిన్‌ని కూడా హిందూ దేవాలయంలోకి రానివ్వలేదు. ఇంకొంత మంది హీరోయిన్లకు కూడా ఈ అనుభవం ఎదురైంది. సన్ని లియోన్‌తో ఎవర్నీ పోల్చే ధైర్యం కూడా మనం చెయ్యలేం. పైగా ఆమె క్రిస్టియన్ కూడా. మరి ముంబాయిలో ఎంతో పవిత్రంగా చెప్పుకునే దేవాలయంలో ఆమెకు ఘన స్వాగతం లభించిందంటే సన్ని గురించి వారికి తెలియదనుకోవాలా? లేక ఆమెకు మాత్రమే ఆ రూల్‌ని సడలించారా.